Thursday, September 3, 2015

                                                       మార్పు

మన ముందు కొన్ని వేల తరాలు బ్రతికారు 
మనం చరిత్ర చదువుకున్నాం, చాలా తెలుసు అనుకుంటాం.
మనకిఎన్ని మూలాలు తెలుసు ? 
అంతెందుకు ?
మన తాతకి తాతకి తాత ఎం చేసేటోడు ఎంత మందికి తెలుసు ?
మనది కాని తరం పేరు వెనక తగిలించుకుని 
మనది కాని తరం కోసం ధనం పోగేసుకుంటున్నామ్....
మనకి మన పక్కింటి వాళ్ళతో  పడదు కానీ, 
ఎక్కడో ఉన్న అదే మన మతపు , కులపు పట్టింపులు మాత్రం 
fevicol కన్నా బలంగా అంటెపెట్టుకుని ఉంటాం.

ఎన్నో కవితలు ప్రేమనే ఊపిరిగా పోసుకున్నాయి కానీ 
పెళ్లి ప్రస్తావన తీస్కురాలేకపోయినాయి....
పదాలని కలాలు కలిపినంత సులువుగా 
ఆ కలలని కులాలు కలపవు. 

ఒక సందు కుక్క ఇంకో కుక్కని ఎలాగైతే రానియదో 
మనం కూడా అలాగే గదుల్లో ఉండిపోయి 
గడులు గీసుకుంటున్నామ్....

రోడ్ పక్కన పది ఉన్న ముసలి వానికి దానం చేద్దామంటే 
Govt 50p బిల్లల ముద్రణ ఆపేసిందని అలక ఒలక బోసే మనం 
గుడి ముందు కొబ్బరికాయ వాడి దగ్గర బేరాలు అడే మనం 
దేవుడికి మాత్రం సంచుల కొద్దీ సమర్పిస్తుంటాం .....
అంటే 
దేవునికి మనం ఇచ్చే అంత గొప్పవాళ్ళమా ? 
లేక మనం ఇచ్చే వాళ్ళు అలా గొప్పవారై ఉండాలా ? 
మనం ఎలా సంపాదించామో, ఏం కోరుకోబోతున్నామో  
అన్నీ తెలిసి కూడా పుణ్యం ఎలా ప్రసాదిస్తాడు అనుకుంటాం ? 

రెండు రోజులు ఏమీ తినకుండా ఉండి 
తర్వాత రెండు బిందెలతో మనకి మనం పాలాభిషేకం చేస్కుంటే 
మనకే తెలిసి వస్తుంది ఏది అర్ధం , ఏది వ్యర్దం అనేది.        

Sunday, August 30, 2015

Capitalism, ఒక మాయ లాంటిది

అది నీ జేబుని చూడదు
నీ జీవితాన్నంతా తన జేబులో ఏస్కుపోతుంది.
నిన్నే ప్రతి అడుగు దానికి ఊడిగలు చేస్తూ బ్రతికేలా చేస్తుంది. 
చాక్లేట్లు (cocoa beans) పండించే వాడికి  అవి చేదు  అని చేరనివ్వదు. 
అందులో చక్కెర కలిపి ప్రపంచం అంతా చక్కెర్లు కొట్టించి మరీ అమ్ముతుంది.
Loans అని Insurance లని Credit Card అని రకరకాలివి
కనిపెడతది- కొనిపెడతది,
తర్వాత మనకి అదే పని పడతది.
లేని రోగాలకి మందులంటాది.   
రాని రోగాలకి టీకా లంటది.  
రాబోయే చావుకి బీమా అంటాది.
మన ఆశల్ని మనకే అమ్మేస్తూ,  

మనం అస్తమించే వరకు విశ్రమించదు.