Sunday, June 27, 2010

చదివింది రాక.....వచ్చింది చదవకా ....

Sem  మొత్తం హాయి హాయిగా 
ఆట పాటల్లో మునిగి  తేలగా  
పరిక్ష ముందు రేయి మొత్తం 
జాం జాముగ  జాము  వరకు సాగగా 
పరిక్ష రోజున పొర్లుదండాలు పెట్టి 
హాలుకు పరుగులాడగా ......


చేతికొచ్చిన  పేపరు 
చిక్కువీడక 
తలలు పట్టుకున్నా 
తిక్క చూపులు తప్పక ........


చదివింది రాక.....వచ్చింది చదవకా ....
క్లాసు లో వినక కునుకు లో మునక......!


భవిష్య జీవితాన్ని  ఒక తెల్ల కాగితంలోని 
నల్ల సిరాతో కొలిచేవాడు 
నా రాతల్నే కాదు.....
నా తలరాతల్నీ ............మార్చేశాడు....!!!!       

No comments:

Post a Comment