Wednesday, June 23, 2010

అడవి కాచే వెన్నెల

డవి కాచే వెన్నెల
నన్ను చేరు ఓ మారిలా
వెంట నడిచే నీడలా
నిత్యం తలచే ఓ కలా
నిలిచిపోవే నీ వలా
పంటపైరుల పసిడిలా
యదకు వీచే గాలిలా

ఓ మగువా మగువా నువ్విలా ........

వేచిఉన్న కెరటమా
పొంచి ఉన్న ప్రళయమా
అందమైన శిల్పమా
ఆవహించే విరహమా

ఓ మగువా మరి నీవెవరుమా ...?

నింగి నున్న  తారక
భువికి  చేరవే నీవిక
మదిని కాల్చుతూ మెరవక
అందించవే ఓ కానుక.....

ఓ మగువా నీ దయ చూపిక~~~~~నా దరికి నీవు చేరిక .....!!!

No comments:

Post a Comment