Capitalism, ఒక మాయ లాంటిది
అది నీ జేబుని
చూడదు
నీ జీవితాన్నంతా
తన జేబులో ఏస్కుపోతుంది.
నిన్నే ప్రతి
అడుగు దానికి ఊడిగలు చేస్తూ బ్రతికేలా చేస్తుంది.
చాక్లేట్లు (cocoa beans) పండించే వాడికి అవి చేదు అని చేరనివ్వదు.
చాక్లేట్లు (cocoa beans) పండించే వాడికి అవి చేదు అని చేరనివ్వదు.
అందులో చక్కెర
కలిపి ప్రపంచం అంతా చక్కెర్లు కొట్టించి మరీ అమ్ముతుంది.
Loans అని Insurance లని Credit Card అని రకరకాలివి
కనిపెడతది- కొనిపెడతది,
కనిపెడతది- కొనిపెడతది,
తర్వాత మనకి అదే
పని పడతది.
లేని రోగాలకి
మందులంటాది.
రాని రోగాలకి
టీకా లంటది.
రాబోయే చావుకి
బీమా అంటాది.
మన ఆశల్ని మనకే
అమ్మేస్తూ,
మనం అస్తమించే
వరకు విశ్రమించదు.
No comments:
Post a Comment